పువ్వు పువ్వు కో వర్ణం . ప్రతి వర్ణం సువర్ణం .అన్ని రంగులు కలగలసిన బతుకమ్మ ...తెలంగాణ కొంగు బంగారం. బతుకును అమ్మగా బావించి, పూలలో, ఆకుల్లో, నీటిలో, ప్రకృతిలో ఆమెను దర్శించి తొమ్మిదిరోజులపాటు ఆటపాటలతో కొలవడం తెలంగాణలో మాత్రమే ఉన్న సంప్రదాయం. బతుకమ్మ పాటలో సామూహిక గానం ఉంది. సంగీతం ఉంది. నృత్యం ఉంది. జీవితం ఉంది .సంతోషం ఉంది. విషాదము ఉంది. ఆ పాటలతో తెలంగాణ స్త్రీలు తమ తతుకును పాడుకుంటరు. తమ ఆనందాలను విషాదాలను తవ్వి పోసుకుంటరు. ఏడేడు తరాల కథలను వినిపిస్తారు. ప్రకృతి వైపరిత్యపు కడగండ్లను సామూహికంగా శ్రుతి చేసుకుంటారు. జీవితం లో సంతోషాన్ని ...పిల్లల ముద్దు ముచ్చట్లను... పంటచేల వయ్యారాలను.. వీరుల త్యాగాలను.. ధేవతల దయను కరుననూ బతుకమ్మ పాటలలో కలగలిపి తలపోసుకుంటరు ...
Subscribe to:
Posts (Atom)

